సుప్రీంకోర్టు తీర్పు స‌రే..బండి కొడుకు మాటేంటి..?

హైదరాబాద్ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఇటీవ‌లే సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. రేపిస్టుల‌కు భ‌యం పుట్టించేలా ఈ తీర్పు వెలువ‌రించింది. మీరు అత్యాచారం చేస్తే, మిమ్మల్ని చంపేస్తాం అనే భయాన్ని కలిగించేలా సుప్రీంకోర్టు వ్యవహరించనుంది. ఇదిలా ఉండ‌గా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారంపై నెటిజన్లు స్పష్టత కోరుతున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

అత్యాచారం చేయాలనే ఆలోచన కూడా రాకుండా పురుషుల మనసుల్లో భయాన్ని కలిగించాలని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో లైంగిక నేరాలకు పాల్పడే వారిని కచ్చితంగా చంపేస్తారనే భయాన్ని సృష్టించడంపై కోర్టు నొక్కి చెప్పింది. రాత్రి వేళల్లో మహిళలు రోడ్లపై నిర్భయంగా నడిచే పరిస్థితిని కల్పించాలని ఆదేశించింది. ఇదే సమయంలో, బీజేపీ ఎంపీ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు విషయంలో నిర్ణయం వెల్లడించాలని నెటిజన్లు వ్యంగ్య ధోరణిలో డిమాండ్ చేస్తున్నారు సోష‌ల్ మీడియా వేదిక‌గా. దీనిపై బీజేపీ, హిందూ సంఘాలు, నేత‌లు ఎందుకు నోరు మెద‌ప‌డం లేదంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

  • Related Posts

    కూటమితోనే రాయలసీమ అభివృద్ది : ఎస్. స‌విత

    వైస్సార్ క‌డ‌ప జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంతో పాటు రాయలసీమ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు. రాయలసీమకు పెద్ద…

    ఫారం-7 దుర్వినియోగంపై ఖ‌ర్గే సీరియ‌స్

    బెంగ‌ళూరు : ఫారం-7 దుర్వినియోగంపై కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగంపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రాజ్యాంగం పరిధిలో పాలన సాగించేవారు బాధ్యతా యుతంగా వ్యవహరించినప్పుడే అది సమర్థవంతంగా పని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *