ఫారం-7 దుర్వినియోగంపై ఖ‌ర్గే సీరియ‌స్

బెంగ‌ళూరు : ఫారం-7 దుర్వినియోగంపై కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగంపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రాజ్యాంగం పరిధిలో పాలన సాగించేవారు బాధ్యతా యుతంగా వ్యవహరించినప్పుడే అది సమర్థవంతంగా పని చేస్తుందని హోం మంత్రి ఖర్గే పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి ఫారం-7ను దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోమవారం హెచ్చరించారు. ముందే ముద్రించిన ఫారమ్‌లను భారీగా ఎలా సేకరించి సమర్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఖర్గే ఇలా అన్నారు:

మీరు ఫారం-7ను దుర్వినియోగం చేస్తే ముందే ముద్రించిన ఫారం-7లను భారీగా కలిగి ఉంటే, బతికున్న వారిని చనిపోయినట్లుగా ఇక్కడే నివసిస్తున్న వారిని స్థానికేతరులుగా పేర్కొంటే… మేము మిమ్మల్ని సన్మానించాలా? అని నిల‌దీశారు ప్రియాంక్ ఖ‌ర్గే. మీరు చట్టాన్ని పాటించకపోతే, దాన్ని ఎలా పాటించాలో నేను మీకు నేర్పుతాను. నిబంధనలను ఎందుకు ఉల్లంఘించాలని అనుకుంటున్నారు? అని మండిప‌డ్డారు. దేశ చట్టాన్ని ఉల్లంఘించి, మీపై ఎలాంటి కేసులు నమోదు కాకూడదని ఎలా ఆశిస్తారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సమస్య కర్ణాటకకు సంబంధించినదని పేర్కొన్న ఖర్గే రాజ్యాంగ , ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

  • Related Posts

    కూటమితోనే రాయలసీమ అభివృద్ది : ఎస్. స‌విత

    వైస్సార్ క‌డ‌ప జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంతో పాటు రాయలసీమ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు. రాయలసీమకు పెద్ద…

    సుప్రీంకోర్టు తీర్పు స‌రే..బండి కొడుకు మాటేంటి..?

    హైదరాబాద్ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఇటీవ‌లే సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. రేపిస్టుల‌కు భ‌యం పుట్టించేలా ఈ తీర్పు వెలువ‌రించింది. మీరు అత్యాచారం చేస్తే, మిమ్మల్ని చంపేస్తాం అనే భయాన్ని కలిగించేలా సుప్రీంకోర్టు వ్యవహరించనుంది. ఇదిలా ఉండ‌గా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *