చెన్నై : తాను ప్రజా నాయకుడినని నిరూపించుకున్నారు ఇప్పటికే టీవీకే పార్టీ చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన సుదీర్ఘ కాలం ఘనమైన చరిత్ర కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. గతంలో రాష్ట్ర సీఎంలుగా పని చేసిన వారు ఏనాడూ ప్రజలతో నేరుగా కలిసిన దాఖలాలు లేవు. ఉన్నా చాలా తక్కువ. కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు సీఎం విజయ్. తను విలక్షణమైన నాయకుడినని నిరూపించుకున్నారు. తాను మాటలు చెప్పడం కంటే చేతల మనిషినని ప్రూవ్ చేసుకున్నారు కూడా విజయ్. దీంతో రోజు రోజుకు తనకు జనాదరణ పెరుగుతుందే తప్పా తరగడం లేదు.
తనపై నమ్మకం ఉంచి తనను భారీ మెజారిటీతో గెలిపించిన , తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి తిరు ఎస్. జోసెఫ్ విజయ్ గారు పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యుల కార్యాలయాన్ని స్వయంగా సందర్శించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, అదే కార్యాలయ ప్రాంగణంలోని ఈ-సర్వీస్ సెంటర్‌లో ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న ఒక లబ్ధిదారునికి ఆ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు ధన్యవాదాలు తెలిపారు .





