విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ణ‌బాలి ట్రైల‌ర్ సూప‌ర్ : లోకేష్

హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో నిరంత‌రం బిజీగా ఉండే ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్న‌ట్టుండి సినిమా గురించి ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తి రేపింది. తాజాగా రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి న‌టించిన చిత్రం ర‌ణ‌బాలి ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన జైల‌ర్ -2 కూడా అక్టోబ‌ర్ 15న విజ‌య ద‌శ‌మి పండుగ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక రణ‌బాలి 16న విడుద‌ల అవుతుంద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. సినిమా ప్ర‌మోష‌న్స్ కొన‌సాగుతోంది. ఈ తరుణంలో ర‌ణ‌బాలి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు నారా లోకేష్.

ఈ చిత్రం ట్రైల‌ర్ ను తాను చూశాన‌ని, అద్బుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ప్ర‌తి ఒక్క‌రు చూడాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా ర‌ణ‌బాలిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కొన‌సాగుతోంది సోష‌ల్ మీడియా వేదిక‌గా. దీనిపై తీవ్రంగా స్పందించారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎవ‌రి సినిమా వారిదేన‌ని కావాల‌ని వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేలా కామెంట్స్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఈ సినిమాలో త‌న‌తో పాటు త‌న భార్య , నేష‌న‌ల్ క్ర‌ష్ ల‌వ్లీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా కూడా కీ రోల్ పోషించింది. ఇక క‌థ విష‌యానికి వ‌స్తే ర‌ణ‌బాలి ఆనాటి బ్రిటీష్ కాలంలో చోటు చేసుకున్న క‌రువు కార‌ణంగా వేలాది మంది ఆక‌లితో అల‌మ‌టించి ప్రాణాలు కోల్పోయారు. దీనినే తెరపై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు.

  • Related Posts

    జైల‌ర్ -2 టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు స‌ర్కార్ ఓకే

    అమ‌రావ‌తి : సూప‌ర్ స్టార్ త‌లైవా ర‌జ‌నీకాంత్ కీ రోల్ పోషించిన చిత్రం జైల‌ర్ -2 . ఈ సినిమా అక్టోబ‌ర్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో త‌న అభిమానుల‌కు తీపి క‌బురు చెప్పింది మూవీ టీం. ఇదిలా ఉండ‌గా…

    వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా

    హైద‌రాబాద్ : అంద‌రూ అనుకున్న‌ట్లే విక్ట‌రీ వెంక‌టేష్ కీ రోల్ పోషించిన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆద‌ర్శ కుటుంబం వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా సోమ‌వారం ప్ర‌క‌టించారు నిర్మాత నాగ‌వంశీ. వాస్తవానికి అక్టోబ‌ర్ 9వ తేదీన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *