కర్నూల్ లో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్
కర్నూల్ జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్నూల్ జిల్లాలో ఏపీ కూటమి సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల, భారతీయ జనతా పార్టీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తో పాటు కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్ , అచ్చెన్నాయుడు కింజరాపు, వంగలపూడి అనిత, ఎస్. సవిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్య ప్రసాద్ , నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడుతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ప్రత్యేకించి ఈ సభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు టీడీపికి చెందిన ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి శ్రీ. గతంలో సునీత మంత్రిగా కూడా పని చేశారు. వీరు స్వయంగా సెల్ఫీ తీసుకున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అద్భుతంగా పని చేస్తోందని పేర్కొన్నారు బండారు శ్రావణి శ్రీ. ప్రస్తుతం అనంతపురం ఉమ్మడి జిల్లాలో మహిళా ఎమ్మెల్యేల హవా కొనసాగుతోంది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు, కంపెనీలు, పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారని అన్నారు. అభివృద్ది, సంక్షేమం తమ సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు.






