అండర్ -19 జట్టు ఎంపికపై హైకోర్టు విచారణ
విచారణ చేపట్టనున్న న్యాయమూర్తి నాగేష్ భీమపాక
హైదరాబాద్ : 2026 సీజన్ కోసం హైదరాబాద్ పురుషుల అండర్-19 జట్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) చేసిన ఎంపిక పద్ధతులపై దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాగేష్ భీమపాక విచారణ కొనసాగిస్తారు. ఎంపిక పద్ధతులపై రిట్ పిటిషన్ దాఖలైదంఇ.
18 ఏళ్ల క్రికెటర్ అవుల నిక్షిత్ తండ్రి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. అర్హత కలిగి ఉండి, స్థిరంగా ప్రదర్శన ఇచ్చినప్పటికీ తన కొడుకు అండర్-19 లీగ్‌లు, ప్రాబబుల్స్, తుది రాష్ట్ర జట్టు ఎంపిక నుండి తప్పించారంటూ వాపోయారు. ఈ ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధత, జవాబుదారీతనం లేదని ఆయన ఆరోపించారు.
అక్టోబర్‌లో షార్ట్‌లిస్ట్ చేయబడిన 30 మంది ఆటగాళ్లకు నిర్వహించిన యో-యో ఫిట్‌నెస్ పరీక్ష ఫలితాలను బహిర్గతం చేయక పోవడం పట్ల పిటిషనర్ బాధపడ్డాడు. యో-యో పరీక్ష ప్రమాణాలను పేర్కొంటూ తన కొడుకును మినహాయించగా, మైదానంలో పేలవమైన ప్రదర్శన HCA – A , B డివిజన్ మ్యాచ్‌లలో తక్కువ స్కోర్‌లు ఉన్న అనేక మంది ఆటగాళ్లను BCCI వినోద్ మన్కడ్ ట్రోఫీ కోసం తుది జట్టులోకి ప్రమోట్ చేశారని ఆయన ఆరోపించారు. సెలెక్టర్లు దురుద్దేశాలను ఆరోపిస్తూ, కొంతమంది ఆటగాళ్లకు అనుకూలంగా నాణ్యత లేని ప్రదర్శనలను దాచిపెట్టారని, తద్వారా మెరిట్‌ను దెబ్బతీశారని ఆరోపించారు.
అధికారిక వెబ్‌సైట్‌లో వ్యక్తిగత పనితీరు డేటా, ఎంపిక ప్రమాణాలు, మూల్యాంకన పారామితులను ప్రచురించడంతో సహా న్యాయమైన, సహేతుకమైన విధానాన్ని అనుసరించాలని ఆయన HCAకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.








