మైస‌మ్మను ద‌ర్శించుకున్న క‌ల్వ‌కుంట్ల క‌విత

రాష్ట్రం బాగుండాల‌ని దేవ‌త‌ను కోరుకున్నా

క‌రీంన‌గ‌ర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత దూకుడు పెంచారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ఆమె జాగృతి జ‌నం బాట ప‌ట్టారు. ఇందులో భాగంగా క‌రీంన‌గ‌ర్ జి్లాలో ప‌ర్య‌టించారు. ఆయా ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. ఇప్ప‌టికే మొంథా తుపాను కార‌ణంగా తీవ్రంగా పంట‌లు న‌ష్ట పోయిన బాధితుల‌తో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలా ఉండ‌గా కరీంనగర్ జిల్లా కేంద్రంలో పేరు పొందిన‌ బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మ వారిని దర్శించుకున్నారు క‌విత‌. ఈ సంద‌ర్బంగా ప్రత్యేక పూజలు చేశారు జాగృతి అధ్యక్షురాలు.

న‌గ‌రానికి విచ్చేసిన క‌విత‌క్క‌కు పెద్ద ఎత్తున సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. జాగృతి శ్రేణులు, బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు. అనంతరం భారీ ర్యాలీ గా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. అనంత‌రం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమ‌ర వీరుల‌కు అంజలి ఘటించారు. అనంత‌రం తెలంగాణ జాతిపిత‌, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆచారి సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు క‌విత‌. రాష్ట్రంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని మైస‌మ్మ అమ్మ వారిని ప్రార్థించ‌డం జ‌రిగింద‌న్నారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *