ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా ఆపేయాలి

Spread the love

సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

తిరుప‌తి జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం తిరుప‌తి జిల్లాలో ఉన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మంగ‌ళంను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఎనిమిది గో డౌన్ల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఎర్ర చంద‌నం దుంగ‌ల వివ‌రాల‌ను ప‌రిశీలించారు. ఇదే స‌మ‌యంలో పూర్తి వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ను త‌క్ష‌ణ‌మే త‌న‌కు అంద‌జేయాల‌ని ఆదేశించారు. ఈ సంద‌ర్బంగా ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌కు షాక్ ఇచ్చారు.

ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే ఆపేయాలని, లేని పక్షంలో ఆపరేషన్ కగర్ తరహాలో స్మగ్లర్లను ఏరి వేయడానికి ఆపరేషన్ మొదలు పెడతామని హెచ్చరించారు. ఉపాధి కోసం ఎర్ర చందనం చెట్లు నరికివేసే వారు ఇకపై స్థానిక అధికారులను సంప్రదించాల‌ని సూచించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. వేరే ఉపాధి మార్గాలు కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

  • Related Posts

    క్లీన్ ఎనర్జీ దిశ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

    Spread the love

    Spread the loveఇందులో పాలు పంచుకోవ‌డం ఆనందంగా ఉంది అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భవిష్యత్తు కోసం ప్రపంచం పరిశుభ్రమైన, మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను చురుగ్గా అన్వేషిస్తోందని అన్నారు. గ్రీన్ అమ్మోనియా అటువంటి…

    న‌ల్ల‌గొండ అభివృద్ది కోసం మ‌రో రూ. 2 వేల కోట్లు

    Spread the love

    Spread the loveతీసుకు వ‌చ్చేందుకు కృషి చేస్తాన‌న్న కోమ‌టి రెడ్డి న‌ల్ల‌గొండ జిల్లా : న‌ల్ల‌గొండ జిల్లాకు ఎంత చేసినా త‌క్కువేన‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇప్ప‌టికే ప‌ట్ట‌ణ అభివృద్ది కోసం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *