స్టార్ ఉమెన్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్
ముంబై : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విజేత జట్టులో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్ మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. తమ గెలుపు వెనుక కఠోర శ్రమ దాగి ఉందన్నారు. ఈ క్రెడిట్ అంతా తమది కాదని, తమను తయారు చేసిన, విశ్వ విజేతలుగా నిలిపేందుకు సహాయం చేసిన తమ కోచ్ అమోల్ మజుందార్ ది అని పేర్కొన్నారు. తమ జీవితంలో మరిచి పోలేనిది ఈ విజయం అన్నారు. అంతే కాకుండా భారత దేశ రాష్ట్ర పతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రశంసలు తమను మరింత ఆడేలా, ఉత్సాహం పొందేలా చేశాయన్నారు జెమీమా రోడ్రిగ్స్.
గతంలో ఎన్నడూ లేని విధంగా జియో హాట్ స్టార్ లో ప్రసారం అయిన భారత్, దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ను 455 మిలియన్ల మంది వీక్షించడం మరింత తమను ఆశ్చర్య పోయేలా చేసిందన్నారు. రాబోయే రోజుల్లో తమపై మరింత బాధ్యత పెంచేలా చేసిందన్నారు ఈ కప్ గెలవడంతో. 143 కోట్ల మంది భారతీయుల ఆశలకు తాము ప్రతిరూపంగా మారడం జీవితంలో మరిచి పోలేమన్నారు జెమీమా రోడ్రిగ్స్.
నేను ఇప్పటికీ ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేననని అన్నారు. వాస్తవానికి ఇప్పటికీ తాము కప్పు గెలిచామంటే నమ్మబుద్ది కావడం లేదన్నారు. ఇది కల కాదు నిజమని ఇప్పుడు తెలుస్తోందని చెప్పారు స్టార్ క్రికెటర్.








