మెడిక‌ల్ కాలేజీల పేరుతో జ‌గ‌న్ డ్రామాలు

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాజకీయ ఉనికి కోసం మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల సేకరణ అంటూ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డ్రామా మొదలెట్టాడంటూ ఎద్దేవా చేశారు మంత్రి ఎస్. స‌విత‌. మెడికల్ కాలేజీలకు భూమి పూజ చేసిన వ్యక్తి, వాటి నిర్మాణాలను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారీలో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయని, కల్తీ నెయ్యి ఘటనలో అన్ని కళ్లూ ఆ ప్యాలెస్ వైపే చూస్తున్నాయని, కల్తీకి కేరాఫ్ అడ్రాస్ జగన్ ప్యాలెస్ అని విమర్శించారు.సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తోందని మంత్రి సవిత వెల్లడించారు. జగన్ హయాంలో భూమి పూజ చేసిన వదిలేసిన మూడు లక్షల ఇళ్లను పూర్తి చేసి, పేదోడి సొంతింటి కలను నెరవేర్చారన్నారు. జగన్ మాదిరిగా కాకుండా, పేదల ఇళ్ల పూర్తికి సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారన్నారు. ఇదీ సీఎం పాలనా దక్షతకు, దార్శనికతకు నిదర్శనమన్నారు.

మొదటి విడతలో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ లో నిర్మించి తీరుతామని మంత్రి సవిత స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలను త్వరగా నిర్మించి, విద్యార్థులకు, వైద్య సేవలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దేశంలో ఎన్నో అభివృద్ధి పనులను పీపీపీ మోడల్ లోను చేపడుతున్నారన్నారు. ఈ విషయం జగన్ కు తెలుసని, రాజకీయ ఉనికి కోసం కోటి సంతకాలు, ఆందోళనలు అంటూ డ్రామా రాజకీయాలు చేస్తున్నారని జగన్ పైనా, వైసీపీ నాయకులపైనా మంత్రి సవిత విరుచుకుపడ్డారు. కాంట్రాక్టర్లను, అధికారులను జగన్ బెదిరిస్తున్నాడని, ఆయనకు గాని, ఆయన బ్యాచ్ కుగాని రాష్ట్రంలో భయపడే వారెవరూ లేరని మంత్రి స్పష్టంచేశారు.

నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *