షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత
మెదక్ జిల్లా : తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చులకన చేస్తూ కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. వ్యక్తులను టార్గెట్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడితే ప్రజలు ఊరుకోరన్నారు. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. శనివారం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు.
పొద్దస్తమానం తన తండ్రిని, తమ కుటుంబాన్ని దెప్పి పొడవడం, కామెంట్స్ చేయడం అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు కల్వకుంట్ల కవిత. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన గనుక బయటకు వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. ఆయన సింహం లాంటోడని, తనను కవ్వించాలని చూస్తే తట్టుకోవడం కష్టమన్నారు. ఇకనుంచైనా పాలనా పరంగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే మంచిదని హితవు పలికారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం కవిత పర్యటించారు.






