అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం వాడాడు

ఐబొమ్మ ర‌విపై సీపీ స‌జ్జ‌నార్ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : ఐ బొమ్మ ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌వి కొట్టిన దెబ్బ‌కు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సంద‌ర్బంగా క‌రేబియ‌న్ దీవుల‌లో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాల‌ను పైర‌సీ చేసి అప్ లోడ్ చేశాడు. హై ఎండ్ టెక్నాల‌జీ వాడాడు. చివ‌ర‌కు త‌న‌ను ప‌ట్టుకోవాలంటూ తెలంగాణ పోలీసుల‌కు కూడా స‌వాల్ విసిరాడు. త‌న భార్య‌తో ఉన్న విభేదాల కార‌ణంగా త‌ను ప‌ట్టుబ‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. మొత్తంగా ఐబొమ్మ ఓన‌ర్ ఇమ్మ‌డి ర‌వికుమార్ ను ప‌ట్టుకోవ‌డం, త‌న‌ను నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డం, చంచ‌ల్ గూడ జైలులో ఉండేలా చేయ‌డం జ‌రిగి పోయింది. ఈసంద‌ర్బంగా ఇందుకు సంబంధించిన కీల‌క అంశాలు వెల్ల‌డించారు సోమ‌వారం మీడియాకు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. ఒక ర‌కంగా సినిమా స‌న్నివేశాల‌ను త‌ల‌పించేలా జ‌రిగింద‌న్నారు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి.

ఐబొమ్మ కార‌ణంగా చాలా సినిమాల‌కు పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లింద‌ని వాపోయాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులంతా వీసీ స‌జ్జ‌నార్ ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌న్నారు. ఇమ్మ‌డి ర‌వి చేసిన స‌వాల్ ను స్వీక‌రించారు పోలీసులు. కేవ‌లం 2 నెల‌ల్లోనే త‌న‌ను ప‌ట్టుకోవ‌డం అద్భుతంగా ఉంద‌న్నాడు. ఈ సంద‌ర్బంగా రాజ‌మౌళి హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. పైర‌సీని తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని కోరాడు. ఏదీ ఉచితంగా రాద‌ని, ఎల్ల‌ప్పుడూ దాచిన ఖ‌ర్చులు ఉంటాయ‌న్నాడు. పైర‌సీ సినిమాలు చూడ‌టం ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయ‌ని పేర్కొన్నాడు. వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తారు. మీ పేరు, నంబర్ లేదా ఇమెయిల్ సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్లవచ్చని , ఆర్థిక మోసానికి పాల్ప‌డే ఛాన్స్ ఉంద‌ని వార్నింగ్ ఇచ్చారు.

  • Related Posts

    సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డ్డాం : నాగార్జున‌

    ఉచిత సినిమాల‌ను చూస్తే డేటా చోరీ హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబం కూడా సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డింద‌న్నాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో…

    రామోజీరావును స్పూర్తిగా తీసుకోవాలి : రేవంత్ రెడ్డి

    ప్ర‌తీ రంగంలో త‌న‌దైన ముద్ర వేశార‌ని కితాబు హైద‌రాబాద్ : రామోజీ రావు ఎదిగిన తీరు అద్భుత‌మ‌ని, ఆయ‌నను స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్స‌లెన్స్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *