బంగ్లాదేశ్ లో అల్లర్లకు, మరణాలకు తనే కారణం
బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది అత్యున్నత కోర్టు. ఇవాళ తనపై విచారణ చేపట్టింది. ఎన్నిసార్లు విచారణకు రావాలని కోరినా తను రాలేదని పేర్కొంది కోర్టు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భారతదేశంలోనే ఉండి పోయిందంటూ మండిపడింది. గత ఏడాది 2024లో ఆగస్టులో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ దేశంలో ఆందోళనలు జరిగాయి. ఇందులో విద్యార్థులు ఎక్కువగా పాల్గొన్నారు. కొన్ని రోజుల తరబడి రాజకీయ సంక్షోభం చోటు చేసుకుంది. ఆందోళనలు, నిరసనల మధ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా. ఆమె నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు వారిపై కాల్పులు ప్రయోగించాలని ఆదేశించారు.
పలువురు ప్రాణాలు కోల్పోయారు. చివరకు తిరుగుబాటు జరిగింది. తనపై దాడి చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ తరుణంలో తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత దేశాన్ని ఆశ్రయించారు. తనను కాపాడాలని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకున్నారు. భారీ భద్రత మధ్య షేక్ హసీనా పారిపోయి ఇండియాకు వచ్చారు. ఆమెకు గట్టి భద్రత ఇచ్చారు. చివరకు తనపై నేరారోపణలు మోపింది ప్రస్తుత సర్కార్. తను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది బంగ్లాదేశ్ కోర్టు. అయినా ఆమె ఆ నోటీసులు పట్టించుకోలేదు. చివరకు గైర్హాజర్ అయ్యింది. సోమవారం విచారణ చేపట్టిన కోర్టు తనకు మరణ శిక్ష ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది.






