ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన
రావల్పిండి : పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కు బిగ్ షాక్ తగిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను తనకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ జోడించ బడింది. ఇది 24 నెలల కాలంలో బాబర్ చేసిన తొలి నేరంగా మారింది. పాకిస్తాన్‌కు చెందిన బాబర్ అజామ్ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడవ వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అవుట్ అయిన తర్వాత మైదానం నుండి నిష్క్రమించాడు. తన బ్యాట్‌తో స్టంప్స్‌ను కొట్టాడు తట్టుకోలేక. దీంతో మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ కూడా యాడ్ చేసింది ఐసీసీ.
31 ఏళ్ల బాబర్ ఆజమ్ ICC ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించాడు. ఇది అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదా ఫిక్చర్‌లు , ఫిట్టింగ్‌లను దుర్వినియోగం చేయడం”కి సంబంధించినది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు అలెక్స్ వార్ఫ్ , రషీద్ రియాజ్, థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ , నాల్గవ అంపైర్ ఫైసల్ అఫ్రిది ఈ ఆరోపణను సమర్ధించగా, ICC ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీల అలీ నఖ్వీ ఈ శిక్షను ప్రతిపాదించారు. పాకిస్తాన్ బ్యాటర్ నేరాన్ని, శిక్షను అంగీకరించాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా లెవల్ 1 ఉల్లంఘనలకు అధికారిక మందలింపు, ఆటగాడి మ్యాచ్ ఫీజులో గరిష్టంగా 50 శాతం జరిమానా, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు ఉంటాయి.








