అయోధ్యలో క్రికెటర్ కుంబ్లే
స్పెషల్ అట్రాక్షన్ గా మారిన అనిల్
అయోధ్య – యావత్ భారతమంతా అయోధ్య నామ జపం చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శ్రీరాముడి ఆలయం. ఎక్కడ చూసినా శ్రీరామ సంకీర్తనలే . ప్రధాన మంత్రి చేతుల మీదుగా పునః ప్రతిష్ట కార్యక్రమం కొనసాగింది. కోట్లాది మంది భక్తులు తన్మయత్వంతో శ్రీరాముడి ప్రారంభోత్సవాన్ని వీక్షించారు. తమ జన్మ ధన్యమైందని పులకించి పోయారు.
ఇదిలా ఉండగా సినీ స్టార్స్ తో పాటు క్రికెటర్లు కూడా ఆనందానికి లోనయ్యారు. ఇందులో భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన అయోధ్యకు వెళ్లారు. అక్కడ తన వారితో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. వెంటనే ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక శ్రీరామ జన్మ భూమి ట్రస్టు 7000 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. ఇందులో సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన వారున్నారు. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , రవీంద్ర జడేజా, ముకేష్ అంబానీ, కంగనా రనౌత్, మాధురీ దీక్షిత్, తదితరులు ఉన్నారు.