బీహార్ లో ఓట్ చోరీ నిజం : ప్ర‌శాంత్ కిషోర్

Spread the love

ఎన్డీయే గెలుపుపై జ‌న్ సురాజ్ అధినేత అనుమానం

పాట్నా : జ‌న్ సురాజ్ పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించారు. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం ఆయ‌న పాట్నాలో మీడియాతో మాట్లాడారు. తాను కూడా రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ పై చేసిన కామెంట్స్ తో ఏకీభ‌విస్తున్నాన‌ని అన్నారు. బీహార్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో చాలా పొర‌పాట్లు జ‌రిగాయ‌ని ఆవేద‌న చెందారు. ఈ విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎందుకు త‌న ప‌నితీరు మార్చుకోవ‌డం లేదో పున‌రాలోచించు కోవాల‌ని సూచించారు. రిజ‌ల్ట్స్ వ‌చ్చిన వెంట‌నే తాను ఓ ప్ర‌తినిధుల‌తో కూడిన బృందాన్ని మ‌ధుబ‌నికి పంపించాన‌ని చెప్పారు. ఇందులో తేలింది ఏమిటంటే 30 శాతం మందికి ఆర్ఎల్ఎం గుర్తు గురించి తెలియ‌ద‌న్నారు. కానీ ఇక్క‌డ ల‌క్ష‌కు పైగా ఓట్లు వ‌చ్చాయ‌ని, ఇది చెప్పాల్సింది కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని సీఎం నితీశ్ కుమార్ అని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ వెలిబుచ్చిన అభిప్రాయాల‌తో తాను పూర్తిగా ఏకీభ‌విస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా ప్ర‌శాంత్ కిషోర్ చేసిన ఈ తాజా కామెంట్స్ బీహార్ రాజ‌కీయాల‌లో క‌ల‌క‌లం రేపుత‌న్నాయి. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల‌లో తాము ఆశించిన మేర ఫ‌లితాలు ద‌క్క‌లేద‌ని పేర్కొన్నారు. ఇందుకు తాను ఎవ‌రినీ నిందించ‌డం లేద‌న్నారు. ఈ ఓట‌మికి పూర్తిగా బాధ్య‌త నాదేన‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌శాంత్ కిషోర్. మ‌రోసారి కాంగ్రెస్ ఎంపీ ఈ ఓట్ల చోరీకి సంబంధించి బండారాన్ని బ‌య‌ట పెట్టాల‌ని హిత‌వు ప‌లికారు . ఇదిలా ఉండ‌గా తాజాగా బీహార్ లో జరిగిన ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ఏకంగా 203 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. ప్ర‌తిప‌క్ష మ‌హాఘ‌ట్ బంధ‌న్ కూట‌మికి ఆశించిన మేర సీట్లు రాక పోగా ఉన్న సీట్ల‌ను పోగొట్టుకుంది.

  • Related Posts

    మ‌య‌న్మార్ అధ్య‌క్షుడితో పీఎం మోదీ భేటీ

    Spread the love

    Spread the loveప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్‌లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్…

    డిజిట‌ల్ హెల్త్ డేటా పూర్తి చేయాలి : సీఎం

    Spread the love

    Spread the loveమే 31వ తేదీ లోపు డెడ్ లైన్ విధించిన స‌ర్కార్ హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *