తెలంగాణ కేబినెట్ కీల‌క తీర్మాణాలు

Spread the love

సీఎం అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం స‌మావేశం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కీల‌క సమావేశం జ‌రిగింది. ప‌లు ముఖ్య‌మైన అంశాల‌పై చ‌ర్చించారు. ప‌లు తీర్మానాల‌కు ఆమోదం తెలిపింది మంత్రివ‌ర్గం. 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 3 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు సీఎం. సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచడానికి 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 2 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలిచేందుకు తీర్మానం చేశారు. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది కేబినెట్. ఇప్పటికే డిస్కమ్‌ల వద్ద ఉన్న ఎంఓయూలను కూడా పరిశీలించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందుకు ఆసక్తిని వ్యక్తీకరించే కంపెనీలకు అవసరమైన భూమి, నీటిని ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ముందుగా రాష్ట్ర డిస్కమ్‌లకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లో కొత్త పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించడం ముఖ్య ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేసింది కేబినెట్.

కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలి. ఇందులో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదని పేర్కొంది. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలి. పాల్వంచ, మక్తల్‌లోనూ ఎన్టీపీసీ అధ్వర్యంలో విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించింది.

  • Related Posts

    సీఎం రేవంత్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ప‌దే ప‌దే అబ‌ద్దాలు…

    ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న జ‌గ‌న్ : ర‌వికుమార్

    Spread the love

    Spread the loveమాజీ ముఖ్య‌మంత్రిపై మంత్రి గొట్టిపాటి షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, ప‌ల్నాడు జిల్లా ఇంచార్జి గొట్టిపాటి ర‌వికుమార్. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని, లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *