జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్ : అచ్చెన్నాయుడు

Spread the love

ప్ర‌జ‌లు మాజీ సీఎంను న‌మ్మ‌రంటూ షాకింగ్ కామెంట్స్

అమ‌రావ‌తి : రైతుల‌ను న‌ట్టేటా ముంచిన ఘ‌న చ‌రిత్ర మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి ఉంద‌న్నారు రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సిడ్బీ రూ.1000 కోట్లకు మౌలిక అనుమతి ఇచ్చినా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం రుణ పరిమితుల ధృవీకరణ, అలాగే ఆర్టికల్ 293(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందక పోవడంతో రుణం విడుదల కాలేదని పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బోరోయింగ్ స్పేస్ వినియోగించ బడటం వల్ల కేంద్ర అనుమతి లభించలేదని చెప్పారు. రూ.2,500 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామనేది కూడా పూర్తిగా అవాస్తవమేన‌ని పేర్కొన్నారు. ఒక్క యూనిట్ స్థానమైవ్వడమో, గ్రౌండ్ పై పని చేయడమో జరగలేదన్నారు. పత్రాల్లో మాత్రమే ప్రాజెక్టులు, నేలపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయని ప్రభుత్వం తమ పాలనను గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు అచ్చెన్నాయుడు.

కూటమి ప్రభుత్వంపై నిందలు మోపే ముందు, ఆయన తన ఐదు సంవత్సరాల పాలనలో రైతులు అనుభవించిన నష్టాలను ఒకసారి వెనక్కి చూసుకోవాలని అన్నారు. ఈ ఏడాది రాయలసీమలో కడప, నంద్యాల, అనంతపురం జిల్లాలలో మొత్తం 40,000 హెక్టార్లలో అరటి సాగు జరిగిందన్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 20 శాతం ఎక్కువ అని అన్నారు. రైతులు ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకొని సాగు విస్తరించారని తెలిపారు. ధరలు తగ్గడానికి కారణాలు అధిక వర్షాల వల్ల నాణ్యత తగ్గడం, ఉత్తరాది రాష్ట్రాలలో సాగు విస్తరణ, రెండో కోత పంట ఎగుమతులకు అనువుగాక పోవడం వంటి సహజ మార్కెట్ పరిస్థితులు. కానీ జగన్ ఇవన్నింటిని దాటికి పూర్తిగా రాజకీయ దాడులు చేయడం రైతులను ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించడమేన‌ని అన్నారు.

ప్రస్తుతం ఉత్తమ నాణ్యత గల అరటికాయకు కిలో రూ.7.50 నుండి రూ.8.00 వరకు ధర రావడం, నాణ్యతలేని పంట టన్నుకు రూ.3,000 నుండి రూ.8,000 మధ్య పడటం సహజమే. రెండో కోతలో ఉన్న 17,000 హెక్టార్లలో పంట నాణ్యత సమస్యల వల్ల ఎగుమతులకు అనుకూలంగా లేదు. అయినా కూడా ప్రభుత్వం రైతులకు మంచి ధర కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. మరోవైపు జగన్ చెబుతున్న మా హయాంలో 3 లక్షల టన్నులు ఎగుమతి చేశాం వంటి గణాంకాలు పూర్తిగా అబద్ధం. ప్రస్తుతం గడచిన రెండు నెలల్లో రోజుకు 700–800 టన్నులే ఎగుమతి అవుతున్నాయని అన్నారు. కేంద్రం నుంచి అవార్డులు తీసుకొచ్చామన్న మాటలకు ఎటువంటి రికార్డులు లేవన్నారు. బ‌హిరంగ మార్కెట్ లో అంత‌ర్జాతీయ అంశాల‌తో ముడిప‌డి ఉన్న పంట‌ల‌కు ధ‌ర పెరిగితే మా వ‌ల‌నే పెరిగింద‌ని మాట్లాడుతున్న అవ‌గాహ‌న లేని మాజీ సీఎం జ‌గ‌న్ అని ఎద్దేవా చేశారు.

  • Related Posts

    ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న జ‌గ‌న్ : ర‌వికుమార్

    Spread the love

    Spread the loveమాజీ ముఖ్య‌మంత్రిపై మంత్రి గొట్టిపాటి షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, ప‌ల్నాడు జిల్లా ఇంచార్జి గొట్టిపాటి ర‌వికుమార్. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని, లా…

    జ‌గ‌న్ ప్రోద్బ‌లంతోనే దాడుల ప‌రంప‌ర‌ : ఎస్. స‌విత

    Spread the love

    Spread the loveకులాల మధ్య కొట్లాటకు కుట్ర‌ల‌కు తెర లేపారు శ్రీ స‌త్య సాయి జిల్లా : రాష్ట్రంలో దాడుల ప‌రంప‌ర‌కు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి కార‌ణ‌మ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *