ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

శ‌ని,ఆదివారాల‌లో భారీగా వ‌ర్షాలు

అమ‌రావ‌తి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో భారీగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించింది. గురువారం ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్ కీల‌క సూచ‌న‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించారు. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుపాన్ నెల‌కొంద‌న్నారు. దీనికి ‘దిత్వా’ గా పేరు పెట్ట‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ తుపాను ప్ర‌భావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,ఆనుకుని ఉన్న దక్షిణకోస్తా తీరాలకు విస్త‌రిస్తుంద‌న్నారు ఎండీ.

గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో తుపాను క‌దిలింద‌ని తెలిపారు. ట్రింకోమలీ (శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంద‌ని స్పష్టం చేశారు ప్ర‌ఖ‌ర్ జైన్. ఆదివారం తెల్లవారుజాముకి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయ‌ని , అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. రైతులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు ప్ర‌ఖ‌ర్ జైన్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *