మెరుగైన పౌర సేవ‌లు అందించాలి : సీఎం

స‌చివాలయంలో స‌మీక్ష చేప‌ట్టిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వం తాజాగా తీసుకు వ‌చ్చిన నూత‌న పౌర సేవ‌ల‌కు సంబంధించి ఆరా తీశారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఉన్న‌తాధికారులు, సంబంధిత శాఖ‌లతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది అనేది లేకుండా చూడాల‌ని అన్నారు సీఎం. ప్ర‌త్యేకించి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఫీడ్ బ్యాక్ అనేది అత్యంత కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు . దీని వ‌ల్ల మ‌రింత పౌరుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే కూట‌మి స‌ర్కార్ వినూత్న‌మైన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింద‌ని చెప్పారు. మొత్తం పౌర సేవ‌ల‌ను పూర్తిగా మైక్రోసాఫ్ట్ ఆధ్వ‌ర్యంలో వాట్సాప్ ద్వారానే అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు ముఖ్య‌మంత్రి. దీని వ‌ల్ల శ్ర‌మ ఉండ‌ద‌ని, టైం సేవ్ అవుతుంద‌న్నారు. ఏయే శాఖ‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాయో ఎప్ప‌టిక‌ప్పుడు స‌రి చూసుకోవాల‌ని, ఏ మాత్రం ఇబ్బంది ప‌డినా తాను ఊరుకోనంటూ హెచ్చ‌రించారు నారా చంద్ర‌బాబు నాయుడు. పౌరుల సేవ‌ల‌కు సంబంధించి దేశానికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం రోల్ మోడ‌ల్ కావాల‌ని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *