దీక్షా దివస్ ను దిగ్విజయం చేయండి : కేటీఆర్
పార్టీ శ్రేణులకు ప్రెసిడెంట్ దిశా నిర్దేశం
హైదరాబద్ : ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్ష చేపట్టి విరమించిన రోజు డిసెంబర్ 9వ తేదీ. దీనిని ప్రతి ఏటా దీక్షా దివస్ ను నిర్వహిస్తూ వస్తోంది బీఆర్ఎస్. ఈ సందర్బంగా ఈసారి కూడా దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆనాడు నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని అన్నారు.
పార్టీ కార్యాలయాల వద్ద లేదా ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగుర వేయాలని స్పష్టం చేశారు కేటీఆర్. కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్ తరాలకు గుర్తు చేయాలని అన్నారు. కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన నిమ్స్ (NIMS) , గాంధీ ఆసుపత్రిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నగర నాయకత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.






