బీజేపీకి స‌రైన వ్య‌క్తి నితిన్ న‌బిన్ : అమిత్ షా

త‌న సార‌థ్యంలో పార్టీ మ‌రింత బ‌లోపేతం

ఢిల్లీ : బీహార్ కు చెందిన రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ న‌బిన్ కు ఊహించ‌ని రీతిలో ఏకంగా జాతీయ స్థాయి ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ హైక‌మాండ్ ఏకంగా జాతీయ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా త‌నపై ప్ర‌శంస‌లు కురిపించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా. త‌న‌కు అపార‌మైన అనుభ‌వం ఉంది. సుదీర్ఘ కాలం పాటు బీహార్ రాజ‌కీయాల‌లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని కితాబు ఇచ్చారు అమిత్ షా. ఎంతో మంది సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నా , చాలా మంది పేర్లు త‌మ ప‌రిశీల‌నకు వ‌చ్చిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు నితిన్ న‌బిన్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా నితిన్ న‌బిన్ ట్రాక్ రికార్డు గొప్ప‌గా ఉంది. త‌ను బీహార్ కు చెందిన మాజీ బీజేపీ నాయకుడు కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. 2006లో తన తండ్రి మరణానంతరం ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు నితిన్ న‌బిన్. పాట్నా నుండి జరిగిన ఉప ఎన్నికలో తన మొదటి ఎన్నికలో విజయం సాధించారు. ఆయన బాంకిపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో, నబిన్ ఆర్జేడీ అభ్యర్థిని 51,936 ఓట్ల తేడాతో ఓడించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *