వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర కీ రోల్
హైదరాబాద్ : సంజీవ్ మేగోటి దర్శకత్వంలో వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర కీ రోల్ పోషించిన పోలీస్ కంప్లైంట్ మూవీ టీజర్ హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్బంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడారు. ఉత్కంఠ భరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రంలో కృష్ణసాయి, బేబీ తనస్వి భిన్న పాత్రల్లో మెప్పిస్తారని అన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో భయంతో పాటు ఎంటర్టైన్మెంట్ అందిస్తారని చెప్పారు. 45 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి వరలక్ష్మి యే కారణం అని ప్రశంసించారు. తెలుగు, తమిళం, మలయాళం కన్నడం నాలుగు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నాం అని వెల్లడించారు దర్శకుడు.
ప్రధాన పాత్రల్లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ డైరెక్టర్ చెప్పిన సబ్జెక్టు నచ్చి సినిమా చేశానని అన్నారు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫుల్లుగా కామెడీ చేశానని పేర్కొన్నారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చుతుందని చెప్పారు. ఆ నమ్మకం తనకు ఉందన్నారు. ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు.
అతిథులుగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, హీరో కృష్ణసాయి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి, అడివి సాయి కిరణ్, రావుల వెంకటేశ్వర రావు ఇతరులు పాల్గొని చిత్ర యూనిట్ కి విషెస్ తెలిపారు.







