నేను చని పోలేదు బతికే ఉన్నా
పూనమ్ పాండే షాకింగ్ వీడియో
ముంబై – ప్రముఖ మోడల్, రియాల్టీ షో పార్టిసిపెంట్ , నటి గా గుర్తింపు పొందిన పూనమ్ పాండే సంచలనంగా మారారు. జనవరి 2న ఆమె చని పోయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఆమె మృతి వార్త హోరెత్తి పోయింది. బాలీవుడ్ ప్రముఖులు సైతం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. సంతాప ప్రకటనలు కూడా చేశారు.
సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఒప్పుడు ట్రోల్ కు గురవుతారో ఎవరు ఎప్పుడు ట్రెండింగ్ లోకి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా తాను చని పోయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని, ఇదంతా పూర్తిగా అబద్దమని శనివారం స్వయంగా పూనమ్ పాండే స్పష్టం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ఆమె వీడియో షేర్ చేసింది.
నేను ఇంకా పైకి పోలేదు. బతికే ఉన్నా. శ్వాసతో ఉన్నా అని స్పష్టం చేసింది. చాలా మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రాణాంతకంగా మారిందని వాపోయారు. వేలాది మంది రోజూ చని పోతున్నారని , ఈ వ్యాధి పట్ల జాగ్రత్తంగా ఉండాలని సూచించింది. ఇందుకే తాను ప్రచారం చేయదల్చు కున్నానని తెలిపింది.