యూపీఐ చెల్లింపుల్లో లిమిట్స్ పెంపు

వినియోగ‌దారుల‌కు కేంద్రం ఖుష్ క‌బ‌ర్

ఢిల్లీ : సెప్టెంబర్ 15 నుండి ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ని పెంచుతున్నట్లు ప్ర‌క‌టించింది కేంద్రం. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చ‌సింది. ఇప్ప‌టికే జీఎస్టీ కౌన్సిల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు నాలుగు స్లాబ్ రేట్ల‌ను రెండు స్లాబ్ రేట్ల‌కు కుదించింది. దీంతో ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, క్యాపిటల్ మార్కెట్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ట్రావెల్, ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు వంటి పెద్ద మొత్తాల పేమెంట్స్ కూడా యూపీఐ ద్వారా ఈజీగా చేసుకునేందుకు వీలు క‌లుగుతుంది. ఈ కొత్త మార్పులతో యూపీఐ మరింత శక్తివంతమైన పేమెంట్ ఆప్షన్‌గా మారడం ఖాయం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉండ‌గా క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కు సంబంధించి ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలకు పెంచింది.

ఇన్సూరెన్స్ ప్రీమియమ్స లో ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది యూపీఐ. ఇక ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ లో ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు. ట్రావెల్ పేమెంట్స్ లో ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 10 లక్షలు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కు గాను ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 6 లక్షలు చేసుకోవ‌చ్చ‌ని ఖుష్ క‌బ‌ర్ తెలిపింది. బిజినెస్/మర్చంట్ పేమెంట్స్ మ‌రింత వెసులు బాటు క‌ల్పించింది. ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజువారీ లిమిట్ లేదని ఎంతైనా డ‌బ్బులు పంపించ వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది యూపీఐ.
జ్యువెలరీ కొనుగోళ్లు ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 6 లక్షలు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిటైల్ ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, రోజుకి రూ. 5 లక్షలు, డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ , ఇనిషియల్ ఫండింగ్: ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 5 లక్షలు, ఇనిషియల్ ఫండింగ్‌కి రోజుకి రూ. 2 లక్షలు ఖ‌రారు చేసింది.

పీర్-టు-పీర్ ట్రాన్సాక్షన్స్‌కి పాత లిమిట్స్‌నే కొనసాగిస్తారు. అంటే, సాధారణ యూపీఐ పేమెంట్స్ ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ. 1 లక్షకి మించకూడదు.

  • Related Posts

    రిల‌య‌న్స్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్

    కీల‌క‌మైన పోస్టులో కొలువు తీరింది ముంబై : దేశంలో పేరు పొందిన రిల‌య‌న్స్ గ్రూప్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్ కొలువు తీరారు. రిల‌య‌న్స్ గ్రూప్ ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ చర్య కంపెనీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *