
తెలంగాణ ఉద్యమంలో మాదిగలు కీలక పాత్ర
విశాఖపట్నం జిల్లా : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగలు ముఖ్య భూమిక పోషించారని అన్నారు. కేసీఆర్ పాత్ర ఏమీ లేదంటూ కొట్టి పారేశారు. అన్ని వర్గాల వారు ఏకతాటిపైకి వచ్చారని, తాము అనుకున్నది సాధించారని అన్నారు. బుధవారం చింతా మోహన్ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఏ సీఎం కొడుకూ సాధించలేని ఘనత జగన్ రెడ్డి సాధించాడని చెప్పారు. తను బిలీయనీర్ గా తన తండ్రి వైఎస్సార్ ను అడ్డం పెట్టుకుని సంపాదించాడని అన్నారు. తాను కేంద్ర మంత్రిగా పని చేసినా తన కొడుక్కి ఏమీ ఇవ్వలేక పోయానంటూ వాపోయారు.
కష్టపడ్డాడు జగన్. ఆ తర్వాత సీఎం అయ్యాడు. కానీ అంతటితో ఆగి ఉంటే బాగుండేది కానీ సవాలక్ష అనైతిక కార్యక్రమాలకు తెర తీశాడంటూ చంతా మోహన్ సంచలన ఆరోపణలు చేశారు . మా జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి కొడుకు మిధున్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారని అన్నారు. నిన్న ఆకుపచ్చ కండువాలు వేసుకుని, రైతు పోరు పేరుతో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తపన పడుతున్నారని, అది సాధ్యం కాదని గుర్తిస్తే మంచిదన్నారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ నోబెల్ శాంతి బహుమతి ఆశిస్తున్నారని, అందుకే వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని చెప్పారు చింతా మోహన్. ఈ ఇద్దరి నిర్వాకం కారణంగా ఏపీకి చెందిన ఆక్వా రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని వాపోయారు.