NEWSTELANGANA

రేవంత్ కామెంట్స్ దాసోజు సీరియ‌స్

Share it with your family & friends

కేసీఆర్ పై నీచ భాష త‌గ‌దు

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ పార్టీ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సాధ‌కుడిగా పేరు పొందిన మాజీ సీఎం కేసీఆర్ ప‌ట్ల ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాష అత్యంత దారుణ‌మ‌ని పేర్కొన్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ప్ర‌జాస్వామ్యంలో రోజు రోజుకు విలువ‌లు కోల్పోతున్నామ‌ని బాధ ప‌డుతున్న వారికి రేవంత్ రెడ్డి ఏం స‌మాధానం చెబుతారంటూ ప్ర‌శ్నించారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌రిపాటిగా మారిందన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీగా సంధించిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇవ్వాల్సిన బాధ్య‌త సీఎంపై ఉంద‌న్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని పేర్కొన్నారు దాసోజు శ్ర‌వ‌ణ్‌.

పిచ్చి ప‌ట్టిన‌ట్టు , మాన‌సిక రోగిలా ప్ర‌వ‌ర్తించ‌డం బాధ‌గా ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే బ‌ట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేస్తున్నాడంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకు ప‌డ్డారు. ఓ వైపు రాహుల్ గాంధీ ద్వేషం వ‌ద్దు ప్రేమ కావాల‌ని పాద‌యాత్ర చేస్తుంటే ఇక్క‌డేమో సీఎం ప‌ద్ద‌తి లేకుండా మాట్లాడ‌టాన్ని స‌భ్య స‌మాజం హ‌ర్షించ‌ద‌ని తెలుసు కోవాల‌ని అన్నారు.