పలు సంస్థలకు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఉద్యోగులు
హైదరాబాద్ : నూతన సంవత్సరం వచ్చేందుకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ సమయంలో సంచలన ప్రకటన చేశారు గిగ్ అండ్ ప్లాట్ ఫారమ్ వర్కర్స్ . ఈ మేరకు తమకు ఉద్యోగ భద్రత కావాలని కోరారు. ఈ సందర్బంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు .స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వర్కర్లు తాము ఈనెల 31వ తేదీన బంద్ కు పిలుపు ఇచ్చామని తెలిపారు. ఉబెర్, ఓలా, ర్యాపిడో డ్రైవర్లు అదే రోజు స్ట్రైక్ పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పని వేళలు, భద్రతతో పాటు తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పారదర్శక పే స్ట్రక్చర్ కల్పించాలని.. కిలోమీటర్‌కు రూ.20 కనీసం వేతనం ఇవ్వాలంటూ కోరుతున్నారు వర్కర్స్. అంతే కాకుండా రోజుకు 8 గంటల పనిదినం.. అంతకు మించి పని చేస్తే అదనపు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా కేవలం 10 నిమిషాల డెలివరీ విధానాన్ని తొలగించాలని, దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా పని విధానంలో మార్పులు రావాలని, తమకు సెక్యూరిటీ కల్పించాలని కోరుతున్నారు వర్కర్స్.








