బీజేపీ అంటే ప్రతిపక్షాలకు వణుకు
లోక్ సభలో ప్రధాన మంత్రి మోదీ
న్యూఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. సోమవారం లోక్ సభలో మోదీ కీలక ప్రసంగించారు. దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయని, తిరిగి తామే అధికారంలోకి వస్తామని జోష్యం చెప్పారు.
ప్రధానంగా భారతీయ జనతా పార్టీపై పోటీకి విపక్ష నేతలు వణికి పోతున్నారని మండిపడ్డారు. కొంత మంది లోక్ సభ సీట్లను కూడా మార్చుకున్నారని, మరికొందరు స్థానాలు మారేందుకు తంటాలు పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు ప్రధాన మంత్రి.
ప్రజలు పదే పదే ఓటు రూపంలో తీర్పు చెప్పినా ప్రతిపక్షాలకు బుద్ది రాలేదన్నారు. పదే పదే తమ సర్కార్ పై చేసిన ఆరోపణలే తిరిగి చేస్తూ వస్తున్నారంటూ ఆరోపించారు నరేంద్ర మోదీ. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మార లేదన్నారు. విచిత్రం ఏమిటంటే విపక్ష పార్టీలను కాంగ్రెస్ పార్టీ ఎదగ నీయడం లేదంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ వైఖరి వల్ల, ఒంటెద్దు పోకడ కారణంగా ప్రజాస్వామ్యానికి నష్టం ఏర్పడిందన్నారు ప్రధానమంత్రి.