జనవరి 9వ తేదీన రానున్న చిత్రం
చెన్నై : డైనమిక్ దర్శకుడు హెచ్. వినోథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జన నాయగన్. కోట్లాది మంది ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రూ. 300 కోట్ల భారీ ఖర్చుతో చాలా రిచ్ గా తీశాడు దర్శకుడు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు విజయ్. తనతో పాటు ముఖ్యమైన నటులు కూడా నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాదు తన సినీ కెరీర్ నుంచి తాను నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు. ఒకప్పుడు చిన్న ఇల్లు ఉంటే చాలని అనుకున్నానని, కానీ అంతులేని రాజ సౌధం నిర్మించుకునేలా చేశారని, ఆ క్రెడిట్ అంతా మీకే దక్కుతుందని అన్నాడు విజయ్. మీ కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించాడు. టీవీకే పేరుతో పార్టీని స్థాపించాడు.
జన నాయగన్ చిత్రం ఇదే చివరి చిత్రం కావడంతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఈనెల 3వ తేదీన శుక్రవారం జన నాయగన్ సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుందని వెల్లడించారు. దీంతో పలు భాషలలో కూడా ఇది ముందుకు వస్తుందని తెలిపారు. దళపతి విజయ్ తో పాటు అందాల ముద్దుగుమ్మలు పూజా హెగ్డే, మమతా బైజు, ప్రియమణి ఉన్నారు. వీరితో పాటు బాబీ డియోల్ , గౌతమ్ వాసుదేవ మీనన్ , ప్రకాశ్ రాజ్, నరైన్ , సునీల్ , మోనిషా బ్లెస్సీ, బాబా భాస్కర్, టీజే అరుణా చలం, శ్రీనాథ్, ఇర్ఫాన్ జైన, అరుణ్ కుమార్ రాజన్, లిథన్య
జాసన్ షా, సందీప్ రవిరాజ్ నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.






