గణాంకాల పరంగా బలహీనమైనదని ఆగ్రహం
బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఎన్నికల సంఘం నిర్వాకంపై మండిపడ్డారు. శుక్రవారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఈవీఎం సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గణాంకాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, ఇది పూర్తిగా పక్షపాతంతో కూడుకుని ఉన్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఎన్నికల కమిషన్ నియమించిన సర్వేను ప్రధానమంత్రి కార్యాలయంతో సంబంధం ఉన్న వ్యక్తి నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై తమకు నమ్మకం లేదన్నారు.
ఇదిలా ఉండగా కర్ణాటకలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు)పై ఓటర్ల నమ్మకంపై ఇటీవల నిర్వహించిన సర్వే విశ్వసనీయతపై కాంగ్రెస్ మంత్రి ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సర్వే అసెంబ్లీ నియోజకవర్గానికి 50 మంది ప్రతివాదులను మాత్రమే కవర్ చేసిందని, ఇది గణాంక పరంగా బలహీనంగా ఉందని మండిపడ్డారు. విస్తృత నమూనా లోపాలు , ఎంపిక పక్షపాతానికి గురయ్యే అవకాశం ఉందని, తద్వారా అర్థవంతమైన తీర్మానాలు చేయడానికి ఇది అనుచితమని ఖర్గే హైలైట్ చేశారు.
మే 2025లో నిర్వహించిన సర్వే. కాంగ్రెస్ బహిర్గతం చేసిన వివరణాత్మక ఓటు చోరీ ఆగస్టు 2025లో వెలువడింది. సర్వేలో అసెంబ్లీకి 50 మంది ప్రతివాదులు మాత్రమే ఉన్నారని అన్నారు. ఈ సర్వే బక్వాస్ అని తాము ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.






