NEWSNATIONAL

జార్ఖండ్ లో ప్ర‌జా పాల‌న

Share it with your family & friends

సీఎం చెంపై సోరేన్ వెల్ల‌డి

జార్ఖండ్ – ఆనాటి ఆంగ్లేయుల‌పై సాయుధ పోరాటం చేసి అమ‌రుడైన భిర్సా ముండాను ఆద‌ర్శంగా తీసుకుని త‌మ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు నూత‌న జార్ఖండ్ సీఎం చంపై సోరేన్. తాజాగా అవిశ్వాస తీర్మానంలో గెలుపొందిన అనంత‌రం బిర్సాకు పూలు చ‌ల్లి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం.

ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసినా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు చంపై సోరేన్. ప్ర‌జాస్వామ్యం ప్ర‌స్తుతం ప్ర‌మాదంలో ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా కేంద్రంలో కొలువు తీరిన మోదీ , ఎన్డీఏ స‌ర్కార్, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా చివ‌ర‌కు తాము గెలుపొంద‌డం జ‌రిగింద‌న్నారు.

ఇది అస‌లైన ప్ర‌జాస్వామ్యం అని స్ప‌ష్టం చేశారు చంపై సోరేన్. కుట్ర‌లు, కుతంత్రాలు ఇక్క‌డ చెల్లుబాటు కావ‌ని హెచ్చ‌రించారు. త‌మ ప్రభుత్వం పూర్తి కాలం పాటు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు సీఎం. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తాము ప్ర‌జ‌లంద‌రికీ జ‌వాబుదారీగా ఉంటూ మెరుగైన పాల‌న అందించేందుకు కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు చంపై సోరేన్.