తెలుగు వెలుగుతూనే ఉంటుంది : చంద్ర‌బాబు నాయుడు

ప్ర‌పంచానికి చాటి చెప్పిన నంద‌మూరి తార‌క రామారావు

గుంటూరు జిల్లా : ప్ర‌పంచ భాష‌ల‌లో తెలుగు భాష అత్యంత ప్ర‌త్యేక‌మైన‌ద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గుంటూరులో జ‌రుగుతున్న 3వ ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. తెలుగు ఢోకా లేద‌ని వెలుగుతూనే ఉంటుంద‌న్నారు. అన్నమయ్య, వెంగమాంబ, మొల్ల వంటి వారు భక్తి మార్గంలోనూ తెలుగుకు వెలుగు తెచ్చారని గుర్తు చేశారు. విశ్వనాధ సత్యనారాయణ, సినారె, రావూరి భరద్వాజ వంటివారికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయని చెప్పారు. తెలుగును గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషకు తెచ్చేందుకు గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని ఎన్నటికీ మరువలేం అన్నారు.నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఎకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగు వారిని మద్రాసీలని పిలిచే రోజుల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు త‌నేన‌ని పేర్కొన్నారు.

తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాడి మరణించిన అమరజీవి పొట్టి శ్రీరాములను త్యాగాల‌ను మరువలేం అన్నారు నారా చంద్రబాబు నాయుడు.రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు పదవిని త్యాగం చేసిన బూర్గుల కృష్ణారావు ఎప్పుడూ గుర్తుండి పోతాడ‌ని అన్నారు. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు కృషి చేసిన రామోజీరావును తెలుగు జాతి మరువదన్నారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడు కోవాలంటే భాషను కాపాడాలని కోరారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు మన తెలుగువాడేన‌ని పేర్కొన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. మన భాష, యాస, సంధులు, సమాసాలు, సామెతలు, పొడుపు కథలు మనకే ప్రత్యేకం అన్నారు. అందుకే దేశ భాషలందు తెలుసు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయులు తెలుగు భాషను కీర్తించారని గుర్తు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ తెలుగు భాషకు, తెలుగు జాతికి చేస్తున్న మేలు అభినందనీయం అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ కు అండగా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *