ముంబై స్కిప్ప‌ర్ గా శ్రేయాస్ అయ్య‌ర్

Spread the love

ప్ర‌క‌టించిన సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్

ముంబై : దేశీవాళి టోర్నీ విజ‌య్ హ‌జారే ట్రోఫీ కోసం జ‌రుగుతున్న మ్యాచ్ ల‌లో ఉన్న‌ట్టుండి ముంబై జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న శార్దూల్ ఠాకూర్ కు గాయం అయ్యింది. దీంతో త‌ను కొన్ని మ్యాచ్ ల‌కు దూరంగా ఉండ‌నున్నాడు. ప‌లువురు కీల‌క ఆట‌గాళ్లు ముంబై టీమ్ లో ఉన్న‌ప్ప‌టికీ ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు ముంబై సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ సంజ‌య్ పాటిల్. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హార్దిక్ పాండ్యా, బుమ్రా, య‌శ‌స్వి జైశ్వాల్ లాంటి ప్ర‌ధాన కీల‌క ఆట‌గాళ్లు ఉన్నా కూడా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపించిన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన శ్రేయాస్ అయ్య‌ర్ కు నాయ‌క‌త్వ ప‌గ్గాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది భార‌త్ ఆస్ట్రేలియా లో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి మైదానంలో గాయ‌ప‌డ్డాడు శ్రేయాస్ అయ్యారు. ఆ త‌ర్వాత అన్ని పార్మాట్ ల‌కు దూరంగా ఉన్నాడు. దీంతో ఆరోగ్య ప‌రంగా ఫిట్ గా ఓకే అయితేనే త‌న‌ను ఎంపిక చేస్తామ‌ని ఇప్ప‌టికే బీసీసీఐ క్లియ‌ర్ ప్ర‌క‌ట‌న చేసింది. బెంగ‌ళూరు లోని క్రికెట్ అకాడ‌మీలో త‌ను ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యాడు. అందులో ఓకే అని తేల‌డంతో త‌న ఎంపిక‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఈ సందర్భంగా అయ్య‌ర్ ను బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. న్యూజిలాండ్ తో జ‌రిగే వ‌న్డే సీరీస్ కు ఎంపిక చేశాడు.

  • Related Posts

    త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లోనే మ్యాచ్ లు ఆడుతాం

    Spread the love

    Spread the loveఐసీసీకి స్ప‌ష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా తాము ఇండియాలో జ‌రిగే కీల‌క మ్యాచ్ ల‌ను…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 బ‌రువు 6,175 కిలోలు

    Spread the love

    Spread the love18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ త‌యారీ న్యూఢిల్లీ : అమెరికా వేదిక‌గా ఈ ఏడాది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్స‌ర్ చేస్తోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *