ఏపీలో కొన‌సాగుతున్న ప్ర‌జా పాల‌న : సీఎం

ప్ర‌జ‌ల విశ్వాసం పున‌రుద్ద‌రించామ‌న్న బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న సాగుతోంద‌ని చెప్పారు. ఎన్డీఏ పాలనలో ప్రజల విశ్వాసం పునరుద్ధరించ‌డం జ‌రిగింద‌న్నారు. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు రూ. 6,310 కోట్లు జమ చేశామ‌న్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దీపం 2.0 కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రూ. 2,684 కోట్లు ఖర్చు చేసి 2 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశామ‌న్నారు. 2025లో బలమైన ఫలితాలు సాధించామ‌ని, ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టిజిఎస్), పట్టాదారు పాస్‌బుక్‌లు, ఇతర కీలక అంశాలపై సమీక్షించారు.

సంక్షేమం, అభివృద్ధి, ప్రజా సేవలను కొనసాగించడానికి ఈ సంవత్సరం మరింత కష్టపడి పని చేయాలని అధికారులను ఆదేశించారు. గిగావాట్ల సమీకృత సౌర ఉత్పాదక యూనిట్‌లో రూ. 3,538 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ రాష్ట్రంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు. ‘తల్లికి వందనం’ ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 10,090 కోట్లు జమ చేశామ‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ‘స్త్రీ శక్తి’ కింద ఇప్పటి వరకు రూ. 1,114 కోట్లతో 3.5 కోట్ల మంది మహిళల ప్రయాణానికి వీలు కల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. దీపం 2.0 కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రూ. 2,684 కోట్లు ఖర్చు చేసి 2 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశామ‌న్నారు. సామాజిక పింఛన్లు ఒకటిన్నర సంవత్సరంలో రూ. 50,000 కోట్లకు చేరుకున్నాయన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *