సినిమా వాళ్ల‌ను బెదిరిస్తున్న సీఎం : దాసోజు శ్ర‌వ‌ణ్

Spread the love

రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా త‌ను పూర్తిగా విఫ‌లం చెందాడ‌ని ఆరోపించారు. ఇచ్చిన హామీల‌ను ప‌క్క‌న పెట్టార‌ని, కేవ‌లం బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని, అంతే కాకుండా సీఎం బ్ర‌ద‌ర్స్ తో క‌లిసి దందాల‌కు శ్రీ‌కారం చుట్టార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌ని, తెలంగాణ స‌మాజం ఊరుకోద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమా రంగానికి సంబంధించి కూడా సీఎం బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు అనిపిస్తోంద‌ని అన్నారు.

హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ పైన పెద్ద ఎత్తున జులుం చలాయిస్తున్నాడని ఆరోపించారు. సినిమా వాళ్ళని భ‌యపెట్టి.. లొంగదీసుకొని అవినీతికి పాల్పడుతూ, డబ్బులు దండుకుంటున్నట్లుగా కనిపిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. నచ్చిన వాళ్లకు నజరానా, నచ్చని వాళ్ళకి జుర్మానా అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఆచారి.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *