తనపై మరింత బాధ్యత పెరిగింది
గుంటూరు జిల్లా : మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, అందాల తార నయనతార , టీవీకే గణేష్ కీలక పాత్రలు పోషించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు సంచలనం రేపుతోంది. విడుదలైన 5 రోజులలోనే ఏకంగా వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది. ఎవరూ ఊహించని రీతిలో బిగ్ బ్లాక్ బస్టర్ ను చేశారు. ఏకంగా వరల్డ్ వైడ్ గా సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు రూ. 226 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ చేసిందని అంచనా. చిరంజీవి సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ చేరింది. గతంలో ఆయన నటించిన సైరా, ఖైదీ నంబర్ 1, వాల్తేరు వీరయ్య మూవీస్ రూ. 100 కోట్ల మార్కును దాటాయి. ఇప్పుడు మన శంకర వర ప్రసాద్ గారు మాత్రం రాబోయే రోజుల్లో రూ. 300 కోట్లను కూడా దాటేస్తుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా మెగాస్టార్ మూవీ బిగ్ సక్సెస్ సాధించడంతో చిత్ర బృందం ఫుల్ జోష్ లో ఉంది. ఈ సందర్బంగా సినిమా విజయోత్సవ సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా గుంటూరులో జరిగిన సినీ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ లాంటి మెగా హీరోతో సినిమా చేయాలని కల ఉండేదన్నాడు. కానీ ఆ కోరిక ఈ సినిమాతో తీరిందన్నాడు. తన జీవితంలో మరిచి పోలేని విధంగా సినిమా వచ్చిందని, అదే క్రమంలో అభిమాన దేవుళ్లు ఎవరూ ఊహించని విధంగా సినిమాను బ్లాక్ బస్టర్ , మెగా సక్సెస్ చేశారంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా విజయంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నాడు.






