పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగడుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్తలు రాస్తూ వస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియస్ అయ్యారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. తాను సింగరేణి కుంభకోణంలో ఉన్నానంటూ ప్రస్తావించడంపై తీవ్రంగా మండిపడ్డారు. నిరాధార వార్తలు రాస్తే తాట తీస్తామన్నారు. ఇదే సమయంలో తనకు స్నేహితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు మల్లు భట్టి విక్రమార్క. నా మీద అబద్ధాలు రాసిన ABN రాధాకృష్ణకు చంద్రబాబు మీద రేవంత్ రెడ్డి మీద అపారమైన ప్రేమ ఉండొచ్చు..లేదా నేను రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడుని కాబట్టి ఆయన మీద ఉన్న ద్వేషాన్ని నా మీద చూపిస్తూ విషపూరిత కథనాలు రాసి ఉండొచ్చు అని అన్నారు.
నేను గాలికి వచ్చిన రాజకీయ నాయకుడిని కాదని అన్నారు మల్లు భట్టివిక్రమార్క..40 ఏళ్లుగా సభ బయట సభ లోపల ప్రజల కోసం పోరాటం చేసి నిలబడ్డ వాడినని హెచ్చరించారు. నీచమైన నికృష్టమైన దిగజారిన రాజకీయాల కోసం అబద్ధాలను తయారు చేసి పుకార్లను స్ప్రెడ్ చేసే బలహీనమైన వీక్ క్యారెక్టర్ నాది కాదని స్పష్టం చేశారు. ఆ విషయం రాధాకృష్ణ తెలుసుకుంటే మంచిదని హితవు పలిఆరు. వ్యక్తిగత కక్షలతో యజమానుల ఆదేశాలతో కథనాలు రాసే మీడియా దళారుల రాజకీయాలు నాకు బాగా తెలుసని అన్నారు. నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలను ఆయుధాలుగా మార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎక్కువ కాలం సాగవు అని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి దుష్ప్రచారాలతో నా పోరాటాన్ని ఆపలేరు నా స్వరాన్ని మూసేయలేరు అనన్నారు.





