నిప్పులు చెరిగిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం జిల్లా : ఏపీ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తట్టుకోలేక పోతున్నాడని ఆరోపించారు. తమ వైఫల్యాలను దాచుకునేందుకే వైసీపీ మీడియాపై ఆరోపణలు చేస్తోంది.రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయనే నిజాన్ని వైసీపీ జీర్ణించు కోలేక పోతోందని ధ్వజమెత్తారు. సంక్షేమాన్ని ఓటు బ్యాంక్ రాజకీయంగా మార్చింది వైసీపీనేని ఆరోపించారు కొండపల్లి శ్రీనివాస్. చంద్రబాబు పాలన అంటే ప్రణాళిక, పారదర్శకత, భవిష్యత్ దృష్టితో ముందుకు వెళుతోందన్నారు. అదే వైసీపీకి భయం పెట్టుకుందన్నారు.
ఎరువులు, యూరియా ధరలపై వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి. గిట్టుబాటు ధరలు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? వైసీపీ హయాంలో రైతుల రోదనలు మర్చిపోయారా? అని నిలదీశారు.
రూ.5,600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు కారణం వైసీపీ ఆర్థిక అరాచకం తప్ప మరోటి కాదన్నారు. విద్యార్థుల సమస్యలకు బాధ్యులు వైసీపీ నేతలేనని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం పరిష్కార దిశగా ముందుకు వెళ్తోందని చెప్పారు కొండపల్లి శ్రీనివాస్. ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. విపక్షాల గొంతులు నొక్కిన చరిత్ర వారిదేనంటూ మండిపడ్డారు. పల్నాడు ఘటనపై విచారణ జరుగుతుండగానే వైసీపీ రాజకీయ డ్రామాలు చేస్తోందని ఆరోపించారు కొండపల్లి శ్రీనివాస్.
హత్యా రాజకీయాలపై పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.





