కష్ట పడిన వాళ్లకే టికెట్లు
చంద్రబాబు నాయుడు వెల్లడి
అమరావతి – ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో టికెట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో టికెట్లకు సంబంధించి ఆశావహులు పెరగడంతో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు.
బుధవారం ఉండవల్లి లోని తన నివాసంలో పలువురు నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ చీఫ్. వైసీపీ నుంచి ఎవరు పడితే వాళ్లు వస్తే తీసుకునే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 12 మందికి పైగా పోటీ పడుతున్నారని , వీరిలో సర్వేల ఆధారంగా ఎవరిని ఎంపిక చేయాలనేది తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు.
అందరికీ అవకాశాలు రాక పోవచ్చని, మిగతా పోస్టులలో వారిని భర్తీ చేస్తామన్నారు. పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్ట పడిన నేతలకు నష్టం జరగ కూడదని తన అభిమతమని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు ఉండ కూడదన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేనదే అధికారం అని జోష్యం చెప్పారు.