newsseals.com
ENTERTAINMENT

వారెవ్వా వారెవ్వా అంటున్న అఖిల్ , భాగ్య‌శ్రీ బోర్సే

VijayaBhaskar January 24, 2026
newsseals-VaarevaaVaareva
Spread the love

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న లెనిన్ మూవీ

హైద‌రాబాద్ : ముర‌ళీ కిషోర్ అబ్బూరు దర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం లెనిన్. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు చాలా గ్యాప్ త‌ర్వాత ప్ర‌ముఖ దిగ్గ‌జ న‌టుడు , మ‌న్మ‌థుడిగా పేరు పొందిన అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని. త‌ను ఈ మ‌ధ్య‌నే ముంబై భామ‌తో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం వైర‌ల్ గా కూడా మారింది. తాజాగా లెనిన్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నా ఈ యంగ్ హీరో. అయితే అందాల భామ భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. త‌న‌ను తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి తీసుకు వ‌చ్చాడు మొద‌టిసారిగా ద‌మ్మున్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన హ‌రీష్ శంక‌ర్.

త‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ అనే మూవీ తీశాడు. ఆశించిన మేర ఆడ‌లేక పోయింది. అయినా భాగ్య‌శ్రీ బోర్సే కు అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. రామ్ పోతినేనితో తీసిన సినిమా హిట్ గా నిలిచింది. దీంతో పాటు త‌ను మ‌ళ‌యాళి హీరోతో కూడా బుక్ అయ్యింది. తాజాగా లెనిన్ లో అఖిల్ అక్కినేనితో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ సినిమాను అక్కినేని నాగార్జున‌తో పాటు నాగ‌వంశీ నిర్మించారు. తారాగ‌ణంలో ప్ర‌మోద్ మంజు కూడా ఉ్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించారు. తాజాగా లెనిన్ చిత్రం నుంచి వారెవా వారెవా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్ . ఇది ఇప్పుడు సూప‌ర్ హిట్ టాక్ అందుకుంది. త్వ‌ర‌లోనే లెనిన్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.