తమ పాలనలో దేశం పురోభివృద్ది
స్పష్టం చేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తాము పదేళ్ల కాలంలో ఇచ్చిన ప్రతి మాటను పూర్తి చేశామన్నారు ప్రధాని. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని, వారిని పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగానే కనీసం 375 సీట్లకు పైగానే వస్తాయని జోష్యం చెప్పారు మోదీ. తిరిగి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇక మూడోసారి తాను పీఎంగా కొలువు తీరుతానని, ప్రజలు సుస్థిరమైన , సమర్థవంతమైన పాలనను కోరుకుంటున్నారని చెప్పారు.
దశాబ్ధాల నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్యలను పూర్తిగా పరిష్కరించడం జరిగిందన్నారు మోదీ. 50 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిరం పూర్తి చేయడం చేశామన్నారు. 70 ఏళ్ల తర్వాత కర్తార్ పూర్ కారిడార్ కు మోక్షం లభించిందన్నారు.
70 ఏళ్ల తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేశామని, ట్రిపుల్ తలాక్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను తీసుకు వచ్చిన ఘనత తనదేనన్నారు. 30 ఏళ్ల తర్వాత భారత దేశానికి చాలా అవసరమైన కొత్త విద్యా విధానం వచ్చిందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.