వైద్య సేవ‌లు మిష‌న్ లా సాగాలి : వెంక‌య్య నాయుడు

విద్య‌, వైద్యం ఉచితంగా ప్ర‌జ‌ల‌కు ఏర్పాటు చేయాలి

హైద‌రాబాద్ : దేశ మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని ఎల్.బి. నగర్‌లో వెల్‍నాక్స్ రీహాబిలిటేషన్ నాలుగో కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వైద్య నిపుణులతో ముచ్చటించారు. రీహాబిలిటేషన్ అనే ముఖ్యమైన సామాజిక అవసరాన్ని గుర్తించి రోబోటిక్స్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా డాక్టర్ స్వాతిని ప్రత్యేకంగా అభినందించారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు.

వైద్యం, వైద్యసేవలు ఒక ‘మిషన్’లా సాగాలని స్ప‌ష్టం చేశారు. సర్జరీ తర్వాత రోగి తన సొంత కాళ్లపై నిలబడేలా చేసే ‘గోల్డెన్ విండో’ పీరియడ్‌లో రీహాబిలిటేషన్ పాత్ర కీలకం అన్నారు. దురదృష్టవశాత్తూ దేశంలో ఏటా లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్న తరుణంలో, ఇలాంటి అత్యాధునిక కేంద్రాలు మరిన్ని రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు వెంక‌య్య నాయుడు. బీమా సంస్థలు కూడా రీహాబిలిటేషన్‌ను పూర్తి స్థాయిలో బీమా పరిధిలోకి తీసుకువచ్చి రోగులకు అండగా నిలవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఉప రాష్ట్ర‌ప‌తి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *