సోనియాకు కవిత ఘాటు లేఖ
రోస్టర్ పాయింట్ పై కామెంట్
హైదరాబాద్ – రాష్ట్రంలో ఎన్నికల వేళ మళ్లీ రగడ మొదలైంది. బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అధికారాన్ని కోల్పోయినా ఎక్కడా తగ్గడం లేదు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఓ వైపు హరీశ్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి , పల్లె రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో దుమ్ము రేపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను ఏకి పారేస్తున్నారు. ఇక శాసన మండలిలో మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎంపై మండి పడుతూ మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీకి నేరుగా లేఖ రాస్తున్నట్లు చెప్పారు. దీనికి కారణం రాష్ట్రంలో సీఎంగా రేవంత్ ఉన్నప్పటికీ పాలన అంతా హై కమాండ్ చేతిలో నుంచే కొనసాగుతుందని, అందుకే తాను సోనియాను ప్రస్తావించినట్లు తెలిపారు.
రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా మహిళా హక్కులకు భంగం వాటిల్లేలా ఉన్నది.. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు నిరాకరిస్తే.. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్న మీరు తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు.