రాధా..రామోజీపై కొడాలి కన్నెర్ర
సభకు వచ్చి ఉంటే దాడి చేసే వాళ్లం
విజయవాడ – మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ప్రముఖ మీడియా సంస్థల అధిపతులు రాధా కృష్ణతో పాటు రామోజీరావు గనుక తమ సభకు వచ్చి ఉంటే సీన్ వేరేగా ఉండేదన్నారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
రిపోర్టర్ కాబట్టి దయతో వదిలి పెట్టామని , కానీ అదే సమయంలో రాధాకృష్ణ, రామోజీ గనుక హాజరైతే కీళ్లు విరిచి పారేసే వాళ్లమని సంచలన కామెంట్స్ చేశారు. గత కొంత కాలం నుంచి పచ్చ మీడియా పేట్రేగి పోతోందని ధ్వజమెత్తారు.
ఎన్ని కుట్రలు చేసినా, వ్యూహాలు పన్నినా తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గాల్లో తేలి పోతున్నారని, ఇప్పుడే పవర్ లోకి వచ్చినట్లు కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.
ఆరు నూరైనా తమ టార్గెట్ ఒక్కటేనని జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విధంగా వై నాట్ 175 అన్నది తమ ముందున్న లక్ష్యమని ప్రకటించారు మాజీ మంత్రి.