NEWSTELANGANA

సోనియమ్మ‌కు అభివంద‌నం

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డి ధ‌న్య‌వాదాలు

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏఐసీసీ మాజీ చీఫ్, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ నూత‌నంగా రాజ‌స్థాన్ రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. మొత్తం 10 రాజ్య స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగ‌గా ఆరుగురు కాంగ్రెస్ అభ్య‌ర్థులు , న‌లుగురు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన అభ్య‌ర్థులు ఎన్నిక‌య్యారు.

ఈ సంద‌ర్బంగా సోనియా గాంధీకి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ప్ర‌త్యేకంగా అభినందించారు. త‌ల్లిగా అమ‌రుల త్యాగాల‌కు త‌ల్ల‌డిల్లి పోయింద‌ని, నాయ‌కురాలిగా స్వ‌రాష్ట్ర ఆకాంక్ష‌ను గుర్తించి నెర‌వేర్చింద‌ని కొనియాడారు సీఎం.

తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో శాశ్వ‌తంగా సోనియా గాంధీ నిలిచి పోతుంద‌ని పేర్కొన్నారు. ఆమె రాజ్య‌స‌భ (ఎగువ స‌భ‌)కు ఎన్నిక కావ‌డం సంతోషాన్ని క‌లిగిస్తోంద‌ని తెలిపారు ఎనుముల రేవంత్ రెడ్డి. నాలుగున్న‌ర కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌పున సోనియ‌మ్మ‌కు హృద‌య పూర్వ‌క‌మైన శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.