ర‌ష్మిక ఒక‌రితో ప్రేమ మ‌రొక‌రితో పెళ్లి

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఒక్క‌టైన న‌టి

రాజ‌స్తాన్ : ఒక‌రితో ప్రేమాయణం న‌డిపించి మ‌రొక‌రితో పెళ్లి చేసుకుంది నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా. రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లోని ప్ర‌ముఖ హోట‌ల్ లో గ్రాండ్ గా ఈవెంట్ జ‌రిగింది. ర‌ష్మిక మంద‌న్నా
తన తొలి చిత్రం కిరిక్ పార్టీ సందర్భంగా 2016లో రక్షిత్ శెట్టిని కలిసింది. అతను ఆమె సహనటుడు , నిర్మాత. సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ స‌మ‌యంలో ఆమెకు దాదాపు 20 సంవత్సరాలు, అతనికి 33 సంవత్సరాలు. వారు జూలై 3, 2017న ఒక గ్రాండ్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం సెప్టెంబర్ 2018లో ముగిసింది. సినిమాల్లో కలిసి పనిచేసిన తర్వాత ఆమె 2021 ప్రాంతంలో విజయ్ దేవరకొండతో డేటింగ్ ప్రారంభించిందని పుకార్లు వచ్చాయి.

విజయ్ , అతని కుటుంబం విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లో ఆమెకు మద్దతు ఇచ్చారని నివేదికలు ఉన్నాయి. ర‌ష్మిక మంద‌న్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి గీత గోవిందం మూవీ షూటింగ్ స‌మ‌యంలోనే ప్రేమ‌లో కూరుకు పోయారు. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య మ‌రింత రిలేష‌న్ షిప్ బ‌ల‌ప‌డింది. ఇద్ద‌రూ సినిమాలు చేస్తూనే బిజీ అయ్యారు. చివ‌ర‌కు ఇద్ద‌రు చాలాసార్లు ఎయిర్ పోర్టుల‌లో క‌నిపించారు. ఎట్ట‌కేల‌కు ఫిబ్ర‌వ‌రి 26న రాజ‌స్తాన్ లోని ఉద‌య్ పూర్ లో భారీ ఖ‌ర్చుతో పెళ్లి చేసుకున్నారు. త‌మ పెళ్లికి రావాలంటూ ప్ర‌ముఖుల‌ను క‌లిసి ఆహ్వానించారు. వారిలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు ఇత‌ర వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు అంద‌జేశారు విజ‌య్, ర‌ష్మిక మంద‌న్నా.

  • Related Posts

    ఆ న‌టుల‌తో న‌టించ‌డం మ‌రిచి పోలేని అనుభ‌వం

    చెన్నై : అందాల ముద్దుగుమ్మ‌గా పేరు పొందిన వ‌ర్ద‌మాన న‌టి న‌మిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె ఎంద‌రో న‌టుల‌తో క‌లిసి న‌టించింది. తాజాగా త‌ను న‌టించిన న‌టుల‌లో ఎవ‌రు త‌న‌కు బాగా నచ్చార‌నే విష‌యాన్ని పంచుకుంది. సీఎం విజయ్, అజిత్…

    గాయం త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న షూటింగ్ కు రెడీ

    హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే సినిమా షూటింగ్ సంద‌ర్బంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె తుంటి గాయం నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ రష్మిక త్వరలోనే తన వృత్తిపరమైన పనులను తిరిగి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *