వైష్ణవితో షణ్ముఖ్ జస్వంత్ నిశ్చితార్థం

సినీ, బుల్లితెర‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు

హైద‌రాబాద్ : బిగ్ బాస్ ఫేం ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ సంచ‌ల‌నంగా మారాడు. త‌ను గ‌తంలో యూట్యూబ‌ర్ గా ప‌రిచ‌యం అయ్యాడు. ప‌లు షార్ట్ ఫిలింల‌లో న‌టించాడు. ఆ త‌ర్వాత బుల్లి తెర‌పై సెన్సేష‌న్ రియాల్టీ షో బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఆ త‌ర్వాత త‌ను ఫేమ‌స్ అయ్యాడు. త‌ను ల‌వ్ లో ప‌డ్డాడ‌ని, డేటింగ్ చేస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. వాటన్నింటికి చెక్ పెడుతూ మ‌రింత క్యూరియాసిటీ పెంచేలా ప్ర‌య‌త్నం చేశాడు ష‌న్ముఖ్ జ‌స్వంత్.

ఇదిలా ఉండ‌గా కొన్ని రోజుల క్రితం ఫేస్ చూపించకుండా ఒక అమ్మాయిని పరిచయం చేసాడు షణ్ణూ. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ కు మ‌రోసారి సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. త‌ను ప్రాణ ప్ర‌దంగా ప్రేమించిన వైష్ణ‌వి చోడిశెట్టి అనే అమ్మాయితో నిశ్చితార్థం కూడా చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించాడు ష‌న్ముఖ్ జ‌శ్వంత్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను తానే స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేశాడు. షేర్ చేసిన కొన్ని క్ష‌ణాల‌కే పెద్ద ఎత్తున వైర‌ల్ అయ్యాయి. ఈ నిశ్చితార్థం కార్య‌క్ర‌మానికి సినీ, బుల్లితెర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్ర‌ముఖులు , స్నేహితులు, కుటుంబీకులు హాజ‌ర‌య్యారు.

  • Related Posts

    ఆ న‌టుల‌తో న‌టించ‌డం మ‌రిచి పోలేని అనుభ‌వం

    చెన్నై : అందాల ముద్దుగుమ్మ‌గా పేరు పొందిన వ‌ర్ద‌మాన న‌టి న‌మిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె ఎంద‌రో న‌టుల‌తో క‌లిసి న‌టించింది. తాజాగా త‌ను న‌టించిన న‌టుల‌లో ఎవ‌రు త‌న‌కు బాగా నచ్చార‌నే విష‌యాన్ని పంచుకుంది. సీఎం విజయ్, అజిత్…

    గాయం త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న షూటింగ్ కు రెడీ

    హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే సినిమా షూటింగ్ సంద‌ర్బంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె తుంటి గాయం నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ రష్మిక త్వరలోనే తన వృత్తిపరమైన పనులను తిరిగి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *