క‌న‌క‌దుర్గ గుడిలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు

ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన ఆల‌య అర్చ‌కులు

విజయవాడ: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం వేకువజామున విజయవాడకు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బెజ‌వాడ‌లో కొలువు తీరిన కోరిన కోర్కెలు తీర్చే ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు అమ్మవారి జ్ఞాపిక, శాలువాతో మంత్రిని సత్కరించారు.

అమ్మవారి దర్శనార్థం వచ్చిన తెలుగు రాష్ట్రాల భక్తులు మంత్రితో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపగా, మంత్రి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కనకదుర్గ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మంత్రి వెంట ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, తదితర స్థానిక నేతలు పాల్గొన్నారు. రాష్ట్రాలుగా విడి పోయినా మ‌నంద‌రం ఒక్క‌టేనని అన్నారు.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *