ప్ర‌తి ప‌ల్లెకు స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందిస్తాం

Spread the love

శాస‌న స‌భ‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ వెల్ల‌డి

అమ‌రావ‌తి : ఏపీలోని ప్ర‌తి పల్లెతో పాటు తాండాలో స్వ‌చ్ఛ‌మైన‌, శుద్ద‌మైన తాగు నీరు అందించేందుకు కృషి చేస్తామ‌న్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన ఖర్చు.. 20 నెలల్లో మన ప్రభుత్వం చేసిన ఖర్చు ఒకసారి చూసుకుంటే ఈ విషయం అర్థమవుతుందని అన్నారు డిప్యూటీ సీఎం. సీసీ, బీటీ రోడ్ల కోసం వైసీపీ సర్కార్ రూ. 641 కోట్లు ఖర్చు చేస్తే… కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే రూ. 3853 కోట్లు ఖర్చు చేసింద‌ని చెప్పారు.

వైసీపీ నాయకులు తమ ఐదేళ్ల కాలంలో 854 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 239 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేస్తే… కూటమి ప్రభుత్వం 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 1331 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించినట్టు స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఐదేళ్లలో వైసీపీ పెట్టిన మొత్తం ఖర్చు రూ. 4610 కోట్లు అయితే… కూటమి ప్రభుత్వం 20 నెలల్లో రూ. 11,506 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నామో ఈ లెక్కలే చెబుతాయని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మన దేశంలో ఉన్న కోర్టుల సంఖ్యకు, అక్కడి మౌలిక సదుపాయాలకు, రోజువారీగా నమోదు అవుతున్న కేసుల సంఖ్యకు మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉందన్నారు.

  • Related Posts

    ఉన్న పిల్ల‌ల‌కే దిక్కు లేదు..ముగ్గుర్ని క‌న‌మంటే ఎలా..?

    Spread the love

    Spread the loveఏపీ కూట‌మి స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైఎస్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పాపులేష‌న్ గురించి చేసిన కామెంట్స్…

    ప్రాజెక్టుల నిర్మాణాల్లో రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేదు

    Spread the love

    Spread the loveనాణ్య‌త పాటించ‌క పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ప‌నితీరుపై స‌మీక్ష చేప‌ట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై రాజీ పడే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *